IN THIS ARTICLE WE ARE POSTING INTERESTING FACTS ABOUT LIONS IN TELUGU AND LIONS LIFE STYLE.
మృగరాజు అని మనం సింహాన్ని ఎందుకంటామంటే ఏదో కారణం ఉండే ఉండి ఉంటుంది. ఆ చూపులొ చురుకుదనం ఉంటుంది. ఆ నడకలో రాజసం ఉంటుంది. ఒక్కసారి నిటారుగా మన వంక చూస్తే చాలు మన గుండె ఝల్లు మనకమానదు.
నూట పది రోజుల తల్లి గర్భంలో ఉన్న తర్వాత ఈ సింహాలు జన్మిస్తాయి.
ఒక సింహం ఒక కానుపులో ఒకటి నుంచి ఆరు సింహాలకు
జన్మనిస్తుంది. ఇంత తక్కువ
సంఖ్యలో సింహం పిల్లలు జన్మిస్తాయి కాబట్టి ఇతర క్రూరమృగాల నుంచి ఆపదల నుంచి వీటిని
కాపాడుకోడానికి సింహాలు గుంపులు గుంపులుగా ఉంటాయి. మరియు
ఇతర క్రూరమృగాలు నుంచి వాటి ప్రాంతాలను ఆక్రమించుకోకుండా ఇవి
అడ్డుకుంటాయి. ఆడ సింహాలు కొత్తగా
తన కుటుంబంలోకి వచ్చిన ఈ పిల్ల తమ
సంరక్షణలో పెంచుతాయి. కానీ ప్రతి మగ సింహం వాటిని
ప్రేమగా చూడదు. ఒకసారి ఆధిపత్యం కోసం వీటిని చంపేస్తాయి
కూడా.
సింహాలలో
ఆడ సింహాలు వేగంగా పరిగెడతాయి. మగ సింహాలు గంటకు
60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే ఆడ సింహాలు గంటకి 70 నుంచి 75 కిలోమీటర్లు
పరిగెడతాయి. కానీ ఇవి కొద్ది దూరం మాత్రమే ఇంత
వేగంతో పరిగెడతాయి. ఈ చిన్నసింహం పిల్లలు అవి తల్లి సంరక్షణలో వాటికి 16 నెలల వయసు
వచ్చే వరకు ఉంటాయి. ఒక
సింహం గుంపులో సాధారణంగా 3 నుండి 4 మగ సింహాలు 10 నుంచి నలభై ఆడ సింహాలు ఉంటాయి.
మగ సింహాల
సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇతర మగ సింహాలు వాటికి ఆధిపత్యం లో అడ్డంకిగా మారతాయని
చిన్న మగ సింహం పిల్లలను చంపేస్తాయి.
చాలా మగ సింహాలు ఆధిపత్య పోరులో
మరణిస్తాయి. ఈ చిన్న సింహం పిల్లలు వాటి తల్లి సంరక్షణలో 16 నెలల వయసు వచ్చే వరకు ఉంటాయి. అప్పటివరకు అవి వాటి తల్లి సింహం మరియు ఇతర సింహాలను చూసి ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి.
సింహాలు పుట్టుకతో
గర్జించే లేవు. వీటికి సంవత్సరం వయసు వచ్చేసరికల్లా ఇవి గర్జించడం నేర్చుకుంటాయి. అప్పుడు
వీటి గర్జన ఎనిమిది కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. మరియు గర్జన ఎలా ఉంటుందంటే ఒక ఉరుము శబ్దం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీటికి 16 నెలల వయసు వచ్చిన తర్వాత నుంచి ఇవి పూర్తిస్థాయిలో వేటాడడం ప్రారంభిస్తాయి. పూర్తిగా
ఎదిగిన సింహం మూడు అడుగుల ఎత్తు పది అడుగుల
పొడవు పెరుగుతుంది. మరియు 250 కేజీలు బరువు పెరుగుతుంది.
మగ సింహాలకు
రెండు సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత అవి గుంపులో ఆధిపత్యాన్ని కోరుకుంటాయి. ఈ మగ సింహాలు తమకి తమ
గుంపుకి నాయకుడు కావాలనుకుంటే ఇతర సింహాలతో పోరాడాల్సి ఉంటుంది మరియు ఇవి ముందుగానే ఉన్నా నాయకుడితో కూడా పోరాడాల్సి ఉంటుంది. కానీ బలమైనది చివరికి గెలుస్తుంది. ఆధిపత్య పోరులో పోరాడిన చాలా వరకు సింహాలు గాయపడ్తాయి. ఒక్కో సమయంలో చనిపోతాయి కూడా. గెలిచినవి తమ గుంపుకు తమ నాయకత్వం వహిస్తాయి. కొన్ని ఓడిపోయిన
సింహాలు గుంపును కూడా వదిలి వెళ్లిపోతాయి. ఈ
సమయంలో లో పాత నాయకుడు ఓడిపోయి కొత్త అధికారం వచ్చినట్లయితే కొత్త నాయకుడు సింహం పిల్లలను చంపేస్తాడు. పాత నాయకుడను ఒక్కో సమయంలో గుంపు నుంచి వెలివేస్తాయి. ఇలా ఎన్నో ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ సింహం అడవిలో
10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తుంది. మరి జూలో అయితే 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఈ విధంగా ఒక
సింహం యొక్క జీవితం ఉంటుంది.