IN THIS ARTICLE WE ARE POSTING INTERESTING FACTS ABOUT TIGERS IN TELUGU AND TIGERS LIFE STYLE.
మనకి
టైగర్ అంటే గుర్తొచ్చేది సైబీరియన్ మరియు బెంగాల్ టైగర్ అయినప్పటికీ కూడా తన జీవితం ఒకేలా
ఉంటుంది.
ఒక టైగర్ తన తల్లి కడుపులో 93 రోజుల నుంచి 111 రోజులు ఉంటుంది ఆ తర్వాత తన తోటి టైగర్స్ తో ఈ భూమిపై అడుగుపెడుతుంది. ఒక టైగర్ ఒకే సమయంలో మూడు నుంచి ఏడు పిల్లలకు జన్మనిచ్చింది.కానీ భవిష్యత్తులో వచ్చే ప్రకృతి సవాళ్లను ఎదుర్కొని వాటిలో ఎన్ని మనుగడను కొనసాగిస్తాయో తెలియదు.ఎందుకంటే టైగర్స్ పుట్టినప్పటినుంచి వాటి మనుగడకు సవాళ్లు విసురుతూ ఎన్నో ఆపదలు పొంచి ఉంటాయి. ఆరు నుంచి పన్నెండు రోజులు గడిచిన తర్వాత ఈ పులి పిల్లలు కళ్ళు తెరిచి లోకాన్ని చూడడం ప్రారంభిస్తాయి.
ఇవి నడక ప్రారంభించిన తర్వాత చిన్న పిల్లి పిల్లలు ఏ విదంగా అయితే ఆడుకుంటాయో అదేవిధంగా ఇవి కూడా ఆడుకోవడం మొదలు పెడతాయి. వీటి ఆటలను చూసినప్పుడు మనకు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఈ క్రూర మృగాలు అవుతాయి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ చిన్న పులి కునాలకు నీటితో ఆదుకోవడం అంటే చాల ఇష్టం కానీ అదే నీటిలో చాల సమస్యలు ఎదురుచూస్తూ ఉంటాయి.
వీటికి 6 నుంచి 10 వరాల వయస్సు వచ్చిన తర్వాత మాంసాన్ని తినడం ప్రారంభిస్తాయి. అప్పటివరకు ఇవి తల్లి పాలను త్రాగి పెరుగుతాయి. మరియు వీటికి 6 నెలల వయసు వచ్చినప్పటినుంచి ఇవి వేటాడడాన్ని నేర్చుకోవడం ప్రారంభిస్తాయి. సంవత్సరం నుంచి సంవస్త్రమున్నర వయసు వచ్చినప్పటినుంచి పులులు పూర్తి స్థాయిలో వేటాడ్డం ప్రారంభిస్తాయి. అప్పటివరుకు ఇవి తల్లి పులి యొక్క సంరక్షణలో తల్లి యొక్క స్థావరంలోనే ఉంటాయి.
వీటికి 2 సంవత్సరాల వయసు వచ్చాక ఇవి పూర్తి స్థాయిలో పరిపక్వత చెందుతాయి. అప్పుడు ఇవి 3 అడుగుల ఎత్తు మరియు 300 కేజీల బరువు వరుకు పెరుగుతాయి. ఇవి పూర్తి స్థాయిలో ఎదిగేఅప్పటికీ ప్రతి 7 పులులలో 3 పులులు ప్రకృతి సవాళ్ల వలన చనిపోతాయి. ఇవి ఇలా పూర్తి స్థాయిలో పరిపక్వత చెంది ఎదిగిన తర్వాత వీటిలో సోదరభావం పూర్తిగా తగ్గిపోతుంది.
అప్పుడు ఇవి ఆధిపత్యం కోసం ఒకదానితో ఒకటి పోరాడుతాయి. పోరాటంలో ఓడిపోయిన పులులు చాల గాయపడతాయి. ఒక్కో సమయంలో చనిపోతాయి కూడా . ఈ సమయంలో తల్లి పులి కూడా వాటిని కాపాడదు. ఈ పోరాటంలో బ్రతికి ఉన్నవి విడిపోయి వాటికంటూ స్వాన్తత స్థావరాలను ఏర్పరుచుకుంటాయి. చాలాకొద్ది సందర్భాల్లో మాత్రమే రెండు లేదా మూడు పులులు కలిసి ఉండడాన్ని మనం గమనిస్తాం . ఆ తర్వాత ఇవి ఒంటరిగా జీవిస్తూ ప్రకృతి ఇచ్చే సవాళ్ళను ఎదుర్కుంటాయి మరియు వీటి వేట మెళుకువలను అభివృద్ధి చేసుకుంటాయి. ఇవి వేటాడేటప్పుడు గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి.
మరియు ఇవి 10 సెంటీమీటర్ల గోళ్ళతో ఇవి దాడి చేస్తాయి మరియు 1050PSI Bite Forceతో (1050PSI Bite Force equal to about 450kgs (PSI=Pounds per square inch )) తమ ఎరను పట్టుకుంటాయి. ఇలా వేటాడిన జంతువులను తిని వాటి ఆకలిని తీర్చుకుంటాయి. స్వన్త స్థావరాలను ఏర్పచుకున్నాక ప్రకృతి ఇచ్చే సవాళ్ళను ఎదుర్కుంటూ ఈ పులులు 15 నుంచి 20 సంవత్సరాలు జీవించి వాటి చివరి శ్వాసను విడుస్తాయి. జూలలో ఉండే పులులు మాత్రమే 25 సంవత్సరాలు జీవిస్తాయి. ఈ విదంగా పులియొక్క జీవితం ముగుస్తుంది